
సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,783 మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అదే సమయంలో 168 మంది మృత్యువాత పడ్డారు. 15,290 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,96,121కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 26,25,447మంది కోలుకున్నారు. 33,602 మంది మరణించారు. ప్రస్తుతం 1,37,050 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
బెంగళూరులో 1,100 పాజిటివ్ కేసులు నమోదుకాగా 6,160మంది డిశ్చార్జి అయ్యారు. 39 మంది మృతి చెందారు. బెంగళూరులో మొత్తం కేసుల సంఖ్య 12,03,063కు పెరిగింది. అందులో 11,13,808 మంది కోలుకున్నారు.15,410 మంది మరణించారు. ప్రస్తుతం 73,844 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 1,42,498 నమూనాలు పరీక్షించారు. 1,09,854 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు.
చదవండి: Unlock: జూన్ 21 నుంచి మాల్స్, రెస్టారెంట్లు ఓపెన్!
నాయకత్వ మార్పు ప్రసక్తే లేదు.. వారిపై కఠిన చర్యలు