నైట్‌క్లబ్‌ వద్ద రచ్చ.. ఐటీ యువతులతో అసభ్యకర ప్రవర్తన.. | Bouncers Drag And Assault Guests Outside Gurugram Nightclub | Sakshi
Sakshi News home page

Nightclub: నైట్‌క్లబ్‌ వద్ద రచ్చ.. ఐటీ యువతులతో అసభ్యకర ప్రవర్తన..

Aug 10 2022 8:52 PM | Updated on Aug 10 2022 8:54 PM

Bouncers Drag And Assault Guests Outside Gurugram Nightclub - Sakshi

Nightclub Viral Video.. బౌన్సర్లు ఓ నైట్‌ క్లబ్‌ వద్ద హల్‌చల్‌ చేశారు. పబ్‌కు వచ్చిన మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. ఓ మహిళను అసభ్యకరంగా తాకడంతో ఇదేంటని అడిగిన పాపానికి బాధితులను బౌన్సర్లు చితకబాదారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. నగరంలోని ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని ఓ నైట్‌ క్లబ్‌కు కొంత మంది ఐటీ ఉద్యోగులు వెళ్లారు. వారిలో కొందరు మహిళ ఉద్యోగులు కూడా ఉన్నారు. కాగా, వారు క్లబ్‌లోని ప్రవేశిస్తున్న క్రమంలో ఓ బౌన్సర్‌ యువతితో అనుచితంగా ప్రవర్తించి.. తాకరాని చోట చేతి తగిలించాడు. ఈ విషయం ఆమె.. తన సహచరులకు చెప్పడంతో వారు.. బౌన్సర్లతో వాగ్వాదానికి దిగారు. 

ఈ క్రమంలో బౌన్సర్లు వారిపై దాడి దిగారు. మహిళలు అని కూడా చూడకుండా ఉద్యోగులందర్నీ చితకబాదారు. వారి దాడిలో కొంత మందికి రక్తం కారడంతో ఆపండి అని మహిళలు ఎంతో అరుస్తున్నా బౌన్సర్లు మాత్రం పట్టించుకోలేదు. బౌన్సర్ల దాడిలో బాధితులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. దాడి చేస్తున్న సమయంలో బౌన్సర్లు ఓ వ్యక్తి చేతి ఉన్న వాచ్‌, రూ. 10వేలను తీసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇది కూడా చదవండి: గ్రూప్‌హౌస్‌లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement