ఫార్మా కంపెనీల పక్కనే మా పొలాలున్నాయి. కలుషిత నీటిని వదులుతున్నప్పుడల్లా ఆ నీటి శాంపిళ్లను తీసుకుపోయి పీసీబీ అధికారులకు ఇస్తున్నాం. లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చాం. వాళ్లు వస్తారు.. మమ్మల్ని హైదరాబాద్‌కు పిలుస్తారు. పరిశ్రమల సిబ్బందిని పిలిచి ఇంకోసారి వదలకండనీ చెబుతారు. ఆ తర్వాత కంపెనీలది మళ్లీ షరామామూలే. మా సమస్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – మాధవి లత, మహిళా రైతు


