పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి

Apr 14 2026 8:34 AM | Updated on Apr 14 2026 8:34 AM

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ వద్ద డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల బాధితులు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టర్‌ ఖష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో 900మందికి 60– 75చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఇంటి స్థలాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను నమ్మించి మోసం చేసి అప్పటి కలెక్టర్‌ రొనాల్డ్‌ రోజ్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ ఇస్తామని ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చినమాట నిలబెట్టుకోకుండా పేదలను మోసం చేశారని ఆరోపించారు. పట్టాలు తీసుకున్న 900మంది నిరుపేదలు రోడ్డు మీదకు వస్తే దానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోకన్వీనర్‌ శ్రీదేవి, టీఎఫ్‌టీయూ జిల్లా నాయకులు జలాల్‌ పాషా, గట్టన్న, డబుల్‌ బెడ్‌రూమ్‌ బాధితులు మాధవి, విజయలక్ష్మి, దివ్య, గీత, లలిత, అనిఫాబేగం, లాల్‌బీ, మహమ్మద్‌ సద్దాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement