అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసు

Apr 14 2026 8:34 AM | Updated on Apr 14 2026 8:34 AM

తాగు, సాగునీటి అవసరాల కోసం బ్యారేజీలు..

అమరచింత: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్నానని, అభివృద్ధికి తానెప్పుడు అడ్డుపడే వ్యక్తిని కాదని ఇక్కడ జరిగే అభివృద్ధిని అడ్డుకునేది ఎవరో ప్రజలకు తెలుసని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అమరచింత మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులు, అంగన్వాడీ టీచర్లకు సెల్‌ఫోన్‌లను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి దంపతులకు పట్టువస్త్రాలు అందించారు. ఈసందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జూరాల వద్ద హైలెవల్‌ బిడ్జ్రి నిర్మించడం వల్ల అమరచింత, ఆత్మకూర్‌ పట్టణాలు అభివృద్ది చెందుతాయని నిధులు కేటాయిస్తే వంతెన నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. పార్లమెంట్‌ సభ్యురాలు ఎంపీ అరుణ కేంద్ర నిధులు అంటూ తమ ప్రమేయం ఉండాలంటూ చెప్పుకురావడం, చేసిన శంకుస్థాపనలకు మళ్ల శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సహకారంతో మునుపెన్నడు లేని విధంగా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధిలో ఎవరెన్ని నిధులు తెచ్చిందో తేల్చుకుందామని దమ్ముంటే చర్చకు రావాలని ఎంపీకు సవాల్‌ విసిరారు.

తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో పె ట్టుకుని జూరాల ప్రాజెక్టు ఎగువలో బిడ్జ్రిలు, బ్యారేజీలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీమా నదిపై రెండు బ్యారేజీలు, కృష్ణ నదిపై మినీ జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహించారన్నారు. ప్రతి వేసవిలో తాగునీటి అవసరాల కోసం ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి సాయం చేయ్యమ ని అడిగే వాళ్లమని బ్యారేజీలు, బిడ్జ్రిలు నిర్మించుకుంటే అలాంటి పరిస్థితి ఇకపై ఉండదన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కేశం.నాగరాజ్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సువర్ణ రవి, వైస్‌ చైర్‌పర్సన్‌ రాధ అరుణ్‌, లోకల్‌బాడీ కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement