ఎకరా పొలంలో రూ.70 వేల పెట్టుబడితో ఉల్లి సాగు చేశా. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు తీసుకెళ్తే క్వింటా రూ.800 అడిగారు. తిరిగి తీసుకొచ్చి ఊరూరా తిరిగి విక్రయిస్తున్నా. క్వింటాకు రూ,1,200 వరకు ధర వస్తోంది. ఇలా చేస్తే కనీసం పెట్టుబడినైనా చేతికందే అవకాశం ఉంది. ఈ ఏడాది ఉల్లికి ధర లేక తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – రాజు, ఉల్లి రైతు, మాధవరం
రూ.50 వేల నష్టం..
వాతావరణ మార్పులు ఉల్లి సాగుపై ప్రభావం చూపింది. పంట చేతికొచ్చే సమయంలో కూడా గడ్డ సైజు పెరగలేదు. దీంతో అర ఎకరంలో ఉల్లి సాగుచేస్తే కనీసం 5 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదు. ఉల్లి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి.
– వెంకటయ్య, ఉల్లి రైతు, మరికల్
●


