చిన్నచింతకుంట: రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తోందని ఆర్జేడీ సోమిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని లాల్‌కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రైవేట్‌కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతోందని, నాణ్యమైన విద్యతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ఆంగ్ల నిఘంటువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


