కొత్తపల్లి(మద్దూరు): మద్దూరు పుర కార్యాలయంలో సోమవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 16 వార్డులు ఉండగా 9 వార్డుల్లో అధికార కాంగ్రెస్‌పార్టీ, 6 స్థానాల్లో బీఆర్‌ఎస్ పార్టీ, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి కై వసం చేసుకున్నారు. 4 కో–ఆప్షన్ స్థానాలు ఉండగా.. అధికార పార్టీ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి నలుగురు నామినేషన్లు వేశారు. దీంతో ముందస్తుగా అధికార పార్టీ సభ్యులు క్యాంపునకు వెళ్లి సోమవారం ఎన్నిక సమయానికి కౌన్సిల్ కార్యాలయానికి చేరుకొని ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధికార పార్టీకి చెందిన ఎండీ యాసిన్, హబీబా బేగం, కొత్తూరు యాదవరెడ్డి, మాజీ ఎంపీపీ కూనె విజయలక్ష్మి కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై నట్లు పుర కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. అనంతరం వారికి పుర చైర్‌పర్సన్ సరస్వతి జనార్దన్‌తో కలిసి నియామక పత్రాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ది భీములు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, నిడ్జింత తిరుపతిరెడ్డి, అల్లీపూర్ మాజీ సర్పంచ్ రమేశ్‌రెడ్డి, కూనె సంజీవ్‌కుమార్, జనార్దన్, జంగం బాబు, జీడీ వెంకట్రాములు, గురుగుంట నర్సింహులు, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.


