నారాయణపేట: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలు విని పరిష్కారానికి సంబంధిత అధికారులకు సిఫారస్ చేశారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాగా ప్రజావాణికి 48 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


