● నారాయణపేట మున్సిపాలిటీలో 9,306 ఆస్తులకుగాను రూ.3.82 కోట్లు పన్ను చెల్లించాల్సి ఉంది. ముందస్తుగా 5 శాతం రాయితీతో చెల్లిస్తే రూ.19.10 లక్షల రాయితీపోను రూ.3.62 కోట్లు ఆదాయం సమకూరుతుంది.
● మక్తల్ పురపాలికలో 7,636 ఆస్తులకు రూ.2.14 కోట్లు వసూలు కావాల్సి ఉంది. 5 శాతం రాయితీతో రూ.10.70 లక్షలు పోను రూ.2.03 కోట్ల ఆదాయం సమాకూరుతుంది.
● కోస్గిలో 6,446 ఆస్తులుండగా.. రూ.2.09 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇందులో 5 శాతం రాయితీ రూ.10.45 లక్షలు పోతే రూ.1.98 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
● మద్దూర్‌లో 3,192 ఆస్తులుండగా.. రూ.53 లక్షలు పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇందులో రూ.2.65 లక్షల రాయితీపోను రూ.50.35 ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
సద్వినియోగం చేసుకోవాలి..
మున్సిపాలిటీలోని వివిధ సేవలకు సంబంధించిన పన్నులను క్యూఆర్ కోడ్, వాట్సప్ నంబర్‌తో చెల్లించవచ్చు. పుర ప్రజలు డిజిటల్ విధానంలో పన్ను చెల్లింపులు చేయాలని కోరుతున్నాం. ముందస్తు పన్ను చెల్లింపునకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఆస్తి పన్ను చెల్లించి పురపాలిక అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం.
– గోల్కొండ నర్సయ్య,
పుర కమిషనర్, నారాయణపేట
●


