మరికల్‌కు సంబంధించిన డంపింగ్ యార్డు ఇబ్రహీంపట్నం శివారులో ఉండటంతో కలుషిత నీరు, ద్వురావాసనతో గ్రామస్తులు వ్యాధుల బారినపడుతున్నారు. దీంతోపాటు గ్రామంలో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, అర్హులకు పింఛన్లు తదితర సమస్యలను మండల సమవేశాలు లేక ఎవరికి చెప్పకోవాలో తెలియడం లేదు.
– నాగరాణి, సర్పంచ్, ఇబ్రహీంపట్నం, మరికల్ మండలం
అవగాహన పెరుగుతుంది..
మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాలు అభివృద్ధి ఎలా చేయాలనే అంశంలో నూతన సర్పంచులకు అవగాహన పెరుగుతుంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు సర్పంచులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
– వెంకటయ్య, సర్పంచ్, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్ రూరల్ మండలం


