క్రైస్తవుల భూముల విషయమై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

క్రైస్తవుల భూముల విషయమై ఫిర్యాదు

Mar 19 2026 7:38 AM | Updated on Mar 19 2026 7:38 AM

మక్తల్‌: పట్టణంలోని క్రైస్తవుల భూములు కొనుగోలు చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్న ప్రసాద్‌ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎంబీ ఫీల్డ్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ క్రిష్టఫర్‌ మీసా కోరారు. ఈ మేరకు బుధవారం కమిషనర్‌, తహసీల్దార్‌, సీఐకు వినతిపత్రం అందజేశారు. సదరు భూమిలో 2012లో వందకు పైగా ప్లాట్లను పలువురికి విక్రయించారని, కొనుగోలు చేసిన స్థలాల్లో కొందరు ఇళ్లు, దుకాణాలు కూడా నిర్మించుకున్నారన్నారు. అయితే ఆ భూములపై ప్రస్తుతం ప్రసాద్‌ అనే వ్యక్తి లేని పోని అపోహలను సృష్టిస్తూ భూములు కొనుగోలు చేసిన వారిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. అతడిని ఎవరు నమ్మొద్దని కోరారు.

ఉడిమిళ్లలోగుప్తనిధులతవ్వకాలు

అమ్రాబాద్‌: పదర మండలం ఉడిమిళ్ల సమీపంలోని వినాయకగుడి మాన్యంలోగల చిన్న వినాయకుడి విగ్రహం ఎదుట గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలసి కొంతమంది స్థానికులు ఈ నెల 13న రాత్రి గుడి ఎదుట జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా అటవీశాఖ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది పరారుకాగా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎఫ్‌ఆర్‌ఓ వీరేష్‌గౌడ్‌ను వివరణ కోరగా తవ్వకాలు రెవెన్యూ భూమిలో ఉండటం వల్ల గ్రామ పంచాయతీ దృష్టికి విషయం తీసుకెళ్లామన్నారు. స్థానికులు ఉండటంతో గ్రామపెద్దల ఒత్తిడితో కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement