సహర్ 5–00 (శుక్రవారం తెల్లవారుజామున)
ఉద్యాన పంటల
సాగుపై దృష్టి పెట్టాలి
మరికల్: రైతులు ఉద్యాన పంటలను సాగు చేసేందుకు ముందుకు రావాలని సర్పంచ్ కల్యాణి, ఉద్యాన శాఖ అధికారి లింగారాజ్ అన్నారు. మండలంలోని అప్పంపల్లిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన కూరగాయల విత్తనాలను సర్పంచ్ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి మార్గదర్శకాల మేరకు ఉద్యాన సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాలే దామోందర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు దామోందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.


