కొత్తపల్లి (మద్దూరు): మున్సిపల్ పట్టణ పరిధిలోని రెనివట్ల గ్రామంలోని జామియా మసీద్‌లో మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యశ్రీ శంకర్ రెడ్డి ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. రంజాన్‌ను పురస్కరించుకొని బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం మాట్లాడుతూ హిందూ ముస్లింలు సోదరభావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ మహిమూద్, మహేందర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


