‘రైతు భరోసా’ ఏకకాలంలో చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

‘రైతు భరోసా’ ఏకకాలంలో చెల్లించాలి

Mar 17 2026 8:41 AM | Updated on Mar 17 2026 8:41 AM

నారాయణపేట: యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఏకకాలంలో చెల్లించాలని ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.యాదగిరి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఏఓ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం సకాలంలో రైతు భరోసా అందించకపోవడంతో రైతులు పంట పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా విడుదల చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విడతలు పూర్తి కావడానికి పుణ్యకాలం గడిచి.. మళ్లీ వానాకాలం పంటల సాగు మొదలవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతుభరోసా చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కేంద్ర వ్యవసాయ ధరల నిర్ణయ కమిషన్‌ కేవలం ధరలు నిర్ణయించి.. చేతులు దులుపుకోవడం వరకే పరిమితమవుతందని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి, కృష్ణయ్య, కొండ నర్సింహులు, బి.నారాయణ, బాలకృష్ణ, ఎ.రాములు, సిరిదస్తప్ప, ఎడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement