కృష్ణా: ప్రతి విద్యార్థి పరీక్షలు బాగా రాయాలంటే జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలని జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ సూచించారు. మంగళవారం మండలంలోని ముడుమాల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్టూడెంట్ ఫెస్ట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే అన్నింటా చక్కటి ప్రతిభ కనబర్చే అవకాశం ఉంటుందని, అందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం మండల విద్యాధికారి నిజామొద్దీన్ మాట్లాడుతూ.. 10వ తరగతి కీలకమని, ఇక్కడి నుంచి వెళ్లిన వారు భవిష్యత్‌లో మంచిస్థానంలో నిలబడాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ బాలరాజు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వైద్యనాథన్‌రెడ్డి, ఉపాధ్యాయులు శేఖర్, కుర్మయ్య, రమేష్, తిమ్మప్ప, మాధవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గాలికుంటు వ్యాధి నిరోధక టీకా తప్పనిసరి


