నారాయణపేట రూరల్: దేశంలో ఆరోగ్యవంతమైన యువత నిర్మాణమే లక్ష్యంగా ప్రధాని మోదీ పీఎం సంసద్ ఖేల్ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రతంగ్‌పాండురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, ప్రధానకార్యదర్శి తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు క్రీడాపోటీలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ పరిధిలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారని.. పాలమూరు పరిధిలో ఏప్రిల్ 9 నుంచి 24వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 24 వరకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మండల, అసెంబ్లీ నియోజవర్గ, పార్లమెంట్‌స్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో నాయకులు లక్ష్మి, వెంకట్రాములు, రఘురామయ్యగౌడ్, రఘువీర్ యాదవ్, వెంకటయ్య, కౌన్సిలర్లు సత్య రఘుపాల్, ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.


