ఆమెకు రక్షణ అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆమెకు రక్షణ అవసరం

Mar 9 2026 7:12 AM | Updated on Mar 9 2026 7:12 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా.. అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎన్నో చట్టాలు వచ్చినా.. మహిళలపై వరకట్న వేధింపులు.. సీ్త్రలపై దాడులు, అత్యాచారాలు, గృహహింసతో పాటు పోక్సో కేసులు తగ్గడం లేదు. కామాంధుల చేతుల్లో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం బలవుతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇంటా బయట మహిళలకు నానాటికీ రక్షణ కొరవడుతోంది. నగరంతో పాటు ప్రధాన పట్టణ కేంద్రాల్లో ఉండే మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. కాపురంలో కలతల వల్ల రోజూ పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్న మహిళల సంఖ్య పెరుగుతోంది. చాలా మంది భార్యాభర్తలకు పోలీసుల కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపిస్తున్నారు.

● దేశవ్యాప్తంగా కొత్త క్రిమినల్‌ చట్టం(బీఎన్‌ఎస్‌–2023) అమల్లోకి వచ్చింది. ఇది పాత ఐపీసీ స్థానంలో తీసుకొచ్చారు. ఇందులో మహిళలు, అమ్మాయిలపై జరిగే నేరాల కోసం ప్రత్యేకంగా చాప్టర్‌–5లో సెక్షన్‌ 63 నుంచి 99వరకు సెక్షన్లు ఉన్నాయి. ● ప్రధాన నేరాలకు ఉపయోగించే సెక్షన్లలో అత్యాచారం జరిగినప్పుడు సెక్షన్‌ 63, 64 నమోదు చేస్తారు. ఈ సెక్షన్‌ కింద కనీసం పదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా మైనర్‌ బాలికపై లైంగికదాడి చేసిన సందర్భంలో సెక్షన్‌ 65 ఏర్పాటు చేయగా గ్యాంగ్‌ రేప్‌లో సెక్షన్‌ 70 నమోదు చేస్తారు. ఈ సెక్షన్‌లలో నమోదు అయ్యే కేసుల్లో పదేళ్ల నుంచి జీవిత ఖైదు కొన్ని సందర్భాల్లో మరణ శిక్ష ఉంటుంది. ● పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సందర్భంలో సెక్షన్‌–69 ● మహిళలతో అసభ్య ప్రవర్తన 74

● సెక్సువల్‌గా వేధించిన సందర్భంలో సెక్షన్‌–75 ● దుస్తులు తీసే విధంగా దాడి చేసిన సమయంలో సెక్షన్‌ 76 ● తెలియకుండా వీడియోలు తీసి గోప్యంగా చూసిన సందర్భంలో సెక్షన్‌ 77 ● సోషల్‌ మీడియా, ఫోన్‌లలో, ఫిజికల్‌గా ఫాలో చేసి వేధించిన సందర్భంలో సెక్షన్‌–78 ● వరకట్నం వేధింపుల సందర్భంలో సెక్షన్‌ 85 ● వరకట్నం కోసం మృతి చెందిన సమయంలో సెక్షన్‌ 79.

హెల్ప్‌డెస్క్‌, షీటీం, భరోసా కేంద్రాలతో అండ

జిల్లాలో ఏటా పెరుగుతున్న పోక్సో కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement