84.33 శాతం పోలింగ్
నారాయణపేట: జిల్లాలోని దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్ మండలాల్లో రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ 84.33 శాతం నమోదైంది. మొత్తం 1,50,318 ఓట్లకు గాను 1,26,769 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ మందకొడిగా కొనసాగగా.. 11 నుంచి 12 గంటల వరకు 45 శాతం నమోదైంది. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. 1గంట వరకు 72.34 శాతం ఓటింగ్ నమోదు కాగా.. అప్పటికే క్యూలో నిల్చున్న ఓటర్లు పూర్తయ్యే వరకు 84.33 శాతం పోలింగ్ నమోదైంది. 76,642 మంది మహిళా ఓటర్లకు గాను 64,065 మంది, 73,674 మంది పురుష ఓటర్లకు గాను 62,703 మంది ఓటు వేశారు. అత్యధికంగా దామరగిద్ద మండలంలో 85.21 శాతం.. అత్యల్పంగా ధన్వాడలో 82.14 శాతం పోలింగ్ నమోదైంది.


