బెల్ట్ తీస్తున్నారు!
● ఎస్పీ ఆదేశాలతో బెల్టు దుకాణాలపైవిస్తృత దాడులు
● నెల రోజుల్లో 272 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. 286 ఈ–పెట్టి కేసులు
నారాయణపేట: ఊరూరా పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు పుట్టుకొస్తుండడం.. ఎంతో మంది మద్యానికి బానిసవడం.. పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతుండగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బెల్టు షాపుల్లో రాత్రనక.. పగలనక మద్యం విక్రయిస్తుండడంతో అటు చుట్టుపక్కల జనం, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నూతన ఎస్పీ వినీత్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో అనధికారికంగా మద్యం విక్రయించే బెల్ట్ షాపుల నిర్వాహకులపై పోలీసులు దాడులు షురూ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే మద్యం తాగినట్లు కనిపిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా నెలరోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లు విస్తృతంగా చేపట్టి 272 కేసులు.. బహిరంగ ప్రదేశాల్లో, బెల్టు షాపుల్లో మద్యం విక్రయించే వారిపై, తాగే వారిపై 286 కేసులను నమోదుచేశారు. బెల్టు దుకాణాలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేస్తుండడంతో విక్రయదారుల్లో గుబులు పట్టుకుంది.
ఏపీలో జరిగిన ఘటనతో...
ఏపీలోని కర్నూలు జిల్లా టేకూరి వద్ద జరిగిన బస్సు ప్రమాదం విషయంలో సంచలన నిజాలు బయటికి రావడంతో యావత్ దేశం నివ్వెరపోయింది. హైవేపై ఉన్న ఓ బెల్టు దుకాణంలో ఇద్దరు యువకులు అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం తాగి జాతీయ రహదారిపైకి రావడం, అదుపు తప్పి కిందపడడం, ఆ బైక్‌ను బస్సు ఢీకొనడంతో 19 మంది బస్సులోని ప్రయాణికులు సజీవ దాహన సంఘటనకు కారణమయ్యారంటూ పోలీసుల విచారణ తేలింది. దీంతో ఎస్పీ బెల్టు దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ ఎవరూ మద్యం తాగినా కేసులు నమోదు చేయాల్సిందేనంటూ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుంది. గ్రామాల్లో బెల్టు షాపులు అందుబాటులో ఉండడంతో పొద్దంతా కష్టపడి పనిచేసి సంపాదించిన కూలీ డబ్బులతో మద్యం తాగుతూ ఎంతో మంది సంసారాలను పాడు చేసుకుంటున్నారు. మద్యం తాగాలి అనుకుంటే ఇంటికి తీసుకెళ్లి తాగాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే వారితో పాటు విక్రయించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మాగనూర్ మండలం నేరడుగాంలో ఉన్న
ఓ దాబాలో పట్టుబడిన మద్యం (ఫైల్)
మాగనూర్‌లో బహిరంగ ప్రదేశంలో
మద్యం తాగుతున్న మందుబాబులు (ఫైల్)
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులే..
అనుమతుల్లేవు
గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాం. తమకు సమాచారం అందిస్తే సదరు బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. – అనంతయ్య, ఎకై ్సజ్ సీఐ
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
నిబంధనలకు విరుద్ధంగా గ్రా మాల్లో బెల్టు దుకాణాలు ఏర్పా టు చేసి మద్యం విక్రయించినట్లతే వారిపై కేసులు నమోదు చేస్తాం. తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తాం. బెల్టు దుకాణా లపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటాం.
– వినీత్, ఎస్పీ
బెల్ట్ తీస్తున్నారు!
బెల్ట్ తీస్తున్నారు!
బెల్ట్ తీస్తున్నారు!
బెల్ట్ తీస్తున్నారు!


