యూడైస్ నమోదు తప్పనిసరి
మద్దూరు: పాఠశాలల సమగ్ర సమాచారాన్ని కేంద్ర విద్య పోర్టల్ యూడైస్‌లో విధిగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన యూడైస్ శిక్షణను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూడైస్‌తో పాఠశాల అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికను తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు యూడైస్‌లో పూర్తి వివరాలు నమోదు చేసి మండల విద్యాధికారితో ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఉన్నత పాఠశాలలో ఎక్సెల్, ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ క్లబ్, రీడ్ కార్యక్రమాల నిర్వహణపై ఆరా తీశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహించాలని సూచించారు. సీఎంఓ రాజేంద్ర, సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, యాదయ్య శెట్టి, ఎంఈఓ బాలకిష్టప్ప, ఆర్పీ రాజునాయక్ ఉన్నారు.


