కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం..
బీఏఎస్ స్కీంలో విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలకు రానివ్వకపోతే కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి సమస్యను కలెక్టర్ వివరించాం. ఆమె ఆదేశాల మేరకు విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. చాలా పాఠశాలల్లో ప్రభుత్వం ఫీజులు ఇవ్వలేదని కారణంతో తల్లిదండ్రుల నుంచి పుస్తకాలు, షూ, హాస్టల్ తదితర అవసరాల కోసం డబ్బులు వసూలు చేశారు. వాటిపై జిల్లా అధికారులు కమిటీ వేసి వాటిని పేద విద్యార్థులకు తిరిగి ఇప్పించాలి.
– కమలాకర్, ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్‌నగర్
పుస్తకాలు ఇవ్వలేదు..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో బీఏఎస్ స్కీంలో మా పాప చదువుతుంది. ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కచ్చితంగా పుస్తకాలకు డబ్బులు కడితేనే ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో సొంతంగా డబ్బులు కట్టాల్సి వచ్చింది. జిల్లా అధికారులు స్పందించి డబ్బులు వెనక్కి ఇప్పించాలి.
– రమేష్, విద్యార్థి తండ్రి
మా దృష్టికి వస్తే పరిష్కరిస్తాం..
రెండు వారాల క్రితం బీఏఎస్ స్కీంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ దృష్టికి రావడంతో వెంటనే పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాం. తప్పిస్తే మా దృస్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. తల్లిదండ్రులు సమస్యను మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం.
– సునీత, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి, మహబూబ్‌నగర్
●


