
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
కోస్గి రూరల్: కోస్గి మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని వివేకానంద చౌరస్తా నుంచి మున్సిపాలిటీ పరిదిలోని మాసాయిపల్లి గ్రామం వరకు సీసీ రోడ్డు నిర్మాణం, సైడ్‌లైట్స్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా రూ.350 కోట్లు మంజూరు చేశారని, వాటితో మినీ ట్యాంక్‌బండ్‌లు, ఆహ్వాన తోరణాలు, అండర్ డ్రెయినేజీ, పలు చౌరస్తాల్లో సుందరీకరణ పనులు చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బీంరెడ్డి, నాయకులు రాములు, శ్రీనివాస్, కృష్ణమూర్తి, అన్న కిష్టప్ప, శ్రీనివాస్, బాలేష్ తదితరులు ఉన్నారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
నాగర్‌కర్నూల్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసం నుంచి ఉదయం 8గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి.. 10:30 గంటలకు మన్ననూర్ మృగవాణి అతిథిగృహానికి చేరుకొని స్థానిక రెవెన్యూ అంశాలపై అధికారులతో చర్చిస్తారన్నారు. అనంతరం అమ్రాబాద్ బీటీరోడ్డు నిర్మాణానికి, గిరిజన భవనం ప్రహరీ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారన్నారు. మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం నుంచి జరిగే హెచ్‌సీఏ బి–డివిజన్ టుడే లీగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఎండీసీఏ ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఆదివారం జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో ప్రకటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను మనోహర్‌రెడ్డి అభినందించి మాట్లాడారు. ఇటీవల జరిగిన ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్‌లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటడం అభినందనీయమన్నారు. టుడే లీగ్‌లో మెరుగైన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ వేసవిలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్‌లలో గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. మొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్ నిర్వహించిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీ–డివిజన్ టుడే లీగ్ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి జిల్లా క్రికెట్ గ్రూప్–బీలో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా జట్టు తొలి లీగ్ మ్యాచ్‌ను సోమవారం రాకేష్ లెవన్ జట్టుతో ఆడనుందన్నారు. టుడే లీగ్‌లో పది మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉమ్మడి జిల్లా జట్టుకు దక్కుతుందని, ఈ మ్యాచుల్లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఎండీసీఏ మైదానంలో రెండు లేదా టుడే లీగ్ మ్యాచ్‌లు, బీసీసీఐ మ్యాచ్ జరిగేలా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సభ్యుడు కృష్ణమూర్తి, కోచ్‌లు అబ్దుల్లా, ముఖ్తార్ పాల్గొన్నారు.
ఎండీసీఏ ఉమ్మడి జిల్లా జట్టు
శ్రీకాంత్– కెప్టెన్ (షాద్‌నగర్), అబ్దుల్ రాఫె బిన్ అబ్దుల్లా (మహబూబ్‌నగర్), మహ్మద్ షాదాబ్ అహ్మద్– వైస్ కెప్టెన్ (మహబూబ్‌నగర్), ఎండీ ముఖితుద్దీన్ (మహబూబ్‌నగర్), జయసింహ (పెబ్బేర్), శ్రీకాంత్ (మహబూబ్‌నగర్), అక్షయ్ (నారాయణపేట), సంజయ్ (మహబూబ్‌నగర్), ఛత్రపతి (గద్వాల), రాంచరణ్, గగన్ (నాగర్‌కర్నూల్), శశాంక్ (మహబూబ్‌నగర్), జశ్వంత్ (నాగర్‌కర్నూల్) ఉన్నారు.

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం