
కచ్చితంగా సీజ్ చేస్తాం..
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 16 నుంచి ఫిట్‌నెస్ పరీక్షలు చేస్తున్నాం. ప్రతి ప్రైవేట్ స్కూల్ బస్సులు పాఠశాలల ప్రారంభం నాటికి పరీక్షలు పూర్తిచేసుకోవాలి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరుగుతూ విద్యార్థులను తరలిస్తే అలాంటి బస్సులను కచ్చితంగా సీజ్ చేస్తాం. ప్రతి బస్సులో విద్యార్థుల వివరాలతోపాటు డ్రైవర్, క్లీనర్ వివరాలు తప్పక ఉంచాలి. సీట్ల సంఖ్యకు మించి విద్యార్థులను తరలించినా, పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకపోయినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– కిషన్, ఉమ్మడి జిల్లా డీటీసీ