
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట రూరల్: వేసవి నేపథ్యంలో బాలకేంద్రం ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బాలకేంద్రం సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలిసి తీసేందుకు బాల కేంద్రం ఉపయోగపడుతుందని, వేసవి సెలవులను వృథా చేయకుండా చదువుకు సమానంగా కళలు నేర్చుకోవాలన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వివిధ కళా అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. భరతనాట్యం, సితార్, డ్రమ్స్, కీబోర్డ్, రిథమ్ ప్యాడ్, గాత్రం తదితర అంశాల్లో 41 రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్లు, ఆసక్తి కలిగిన చిన్నారులు వెంటనే అడ్మిషన్ పొందాలని కోరారు.