
15 రోజులు గడిచినా..
వాస్తవానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం చూశాక నిర్వాహకులు కొనుగోలు చేస్తారు. నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకు కనీసం వారం రోజుల సమయం పడుతోంది. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కేవలం రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో పడుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ధాన్యం కొనుగోలు చేసి 15 రోజులైనా బోనస్ డబ్బులు మాత్రం పడటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్ అమలు చేస్తుందా.. లేదా.. అని అయోమయానికి గురవుతున్నారు.

15 రోజులు గడిచినా..