చెరుకు రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

చెరుకు రైతుల ఆందోళన

Apr 9 2025 12:46 AM | Updated on Apr 9 2025 12:46 AM

చెరుకు రైతుల ఆందోళన

చెరుకు రైతుల ఆందోళన

అమరచింత: బకాయి ఉన్న రూ.6 కోట్లు వెంటనే చెల్లించాలంటూ చెరుకు రైతులు కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో షుగర్‌ ఫ్యాక్టరీ ఎదుట మంగళవారం ఆందోళన చేపట్డారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న మా ట్లాడుతూ.. ఫ్యాక్టరీ పరిధిలో కోతలు పూర్తయినా ఇప్పటి వరకు బకాయి డబ్బులు చెల్లించడం లేదన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత ఫ్యాక్టరీ ఏజీఎం, డీజీఎంలకు విన్నవించినా ఫలితం లేకపోయిందని వివరించారు. వెంటనే బకాయి డబ్బులను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాగా, కేన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రవీంద్రరావుకు సమస్యను వివరించగా.. ఆయన ఫ్యాక్టరీ డైరెక్టర్‌ రవికుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వారం రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాసారెడ్డి, చంద్రసేనారెడ్డి, ఆంజనేయలు, నాగేంద్రం, రంగారెడ్డి, షాలిమియా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement