నారాయణపేట: జిల్లాలో మే 10న నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని టీములు సిద్ధంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో జడ్జి మాట్లాడారు. రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మార్చి 8న జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 9825 కేసులు పరిష్కరించి జిల్లా రాష్ట్రంలోనే 13వ ర్యాంకు స్థానంలో నిలిచిందని, ఇందుకు కృషిచేసిన పోలీసులు అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లను అభినందించారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏజెండాలోని అంశాలను నాన్ బెయిల్ వారెంట్ కేసులను, చార్జిషీట్, ఎన్‌ఐ యాక్ట్ పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా అధిక కేసులని పరిష్కరించేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. సమావేశంలో సినియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, జూనియర్ సివిల్ జుడ్గే ఫరహీన్ బేగం కోస్గి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సురేష్ కుమార్, బాలప్ప, ఆర్డీవో ఆఫీసర్, డిఫెన్స్ కౌన్సిల్స్ కె లక్ష్మి పతి గౌడ్, నాగేశ్వరి, మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జొన్నలు క్వింటాల్ రూ.4,800
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జొన్నలు క్వింటాలుకు గరిష్టంగా రూ.4,800, కనిష్టంగా రూ.3,050 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,857, వేరుశనగ గరిష్టం, కనిష్టంగా రూ.4,350, అలసందలు గరిష్టం రూ.7,219, కనిష్టం రూ.7,106, ఎర్ర కందులు గరిష్టం రూ.7,416, కనిష్టంగా రూ.6,609 ధరలు పలికాయి.
వేరుశనగ @ రూ.6,691
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శక్రవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,691, కనిష్టంగా రూ.5,611 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,935, కనిష్టంగా రూ.5,610, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,291, కనిష్టంగా రూ.1,951, జొన్నలు గరిష్టంగా రూ.4,011, కనిష్టంగా రూ.3,817 ధరలు పలికాయి.