సమయపాలన పాటించకపోతే ఎలా..? | - | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించకపోతే ఎలా..?

Mar 21 2025 12:54 AM | Updated on Mar 21 2025 12:50 AM

మాగనూర్‌: పాఠశాల విధులకు ఉపాధ్యాయులే సమయపాలన పాటించకపోతే ఎలా అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. గురువారం మండలంలోని కేజీబీవీని ఉదయాన్నే ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సమయం దాటిపోయినా ఉపాధ్యాయులతో పాటు ఎస్‌ఓ రాధిక పాఠశాలకు రాకపోవడంతో ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు తాను వచ్చిన తర్వాత కూడా రాకపోవడం ఏమిటిని ప్రశ్నించారు. ముఖ్యంగా విద్యార్థులలో క్రమశిక్షణ కొరవడిందని పీఈటీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన విషయాలను ఒక నోట్‌బుక్‌లో రాసిపెట్టాలని సిబ్బందికి సూచించారు. వారంలోగా మళ్లీ పాఠశాల తనిఖీకి వస్తానని, ఈ సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంటగది, మూత్రశాలలలు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.

కేజీబీవీ ఎస్‌ఓ, ఉపాధ్యాయులపైఎమ్మెల్యే ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement