మక్తల్ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో చెత్త నిల్వలు అలాగే ఉండిపోతున్నాయి. ఆ ప్రాంతం మొత్తం దుర్గందభరితంగా మారుతున్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పైన చెత్త అలాగే వదిలేసి వెళ్తున్నారు. వెంటనే చెత్తను తొలగించాలి.
– నాగప్ప, మక్తల్
దుర్వాసన భరించలేకున్నాం..
పట్టణంలో సేకరించిన చెత్తను మా పొలంల గుండా తీసుకెళ్లి ప్రభుత్వ భూమిలో డంప్ చేస్తున్నారు. డంపింగ్ యార్డు లేకపోవడంతో చెత్త కుళ్లిపోయి భరించలేని దుర్వాసన వస్తోంది. పొలాలకు వెళ్లాలంటేనే వాసనకు భరించలేక పోతున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డంపింగ్ యార్డు నిర్మించి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి.
– నర్సిములు, సమీప పొలం రైతు, కోస్గి
●
రోడ్డుపై వదిలేస్తున్నారు