నారాయణపేట రూరల్: స్వామి వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు కదలాలని ఎస్పీ యోగేష్ గౌతం అన్నారు. మండలంలోని కోటకొండలో స్వామి వివేకానందుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్లు కావస్తున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. యువత చెడు మార్గాల్లో పయనించకుండా సన్మార్గంలో వెళ్లాలన్నారు. చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. క్రమశిక్షణ కలిగి లక్ష్యం, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధ్యమేనని తెలిపారు. కార్యక్రమంలో బాలస్వామి, శివరాములు, రవి, సిద్దు, కృష్ణయ్య, సురేందర్, జగదీష్, నరేష్, కిషోర్ పాల్గొన్నారు.
మహిళలపై లైంగిక
వేధింపులను అరికట్టాలి
నారాయణపేట టౌన్: మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులను అరికట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు బాలమణి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ వద్ద అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభలో వారు మాట్లాడారు. మహిళలపై హింస, వేధింపులను ప్రతిఘటించాలని, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు, మెప్మా, ఐకేపీ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల పరిదిలో పనిచేస్తున్న మహిళలను ప్రభుత్వాలే శ్రమ దోపిడీకి గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సాధికారత, సమానత్వం గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ముందు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాధిక, మమత, పార్వతి, నాంచారమ్మ, చంద్రకళ, భాగ్యమ్మ,అశ్విని,సుశీలమ్మ,పలువురు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు
పరిష్కరించాలి
నారాయణపేట రూరల్: జిల్లా విద్యా శాఖలో నెలకొన్న సమస్యలపై నూతనంగా ఎన్నికై న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డికి స్థానిక పీఆర్టీయూ నాయకులు వినతిపత్రం అందించారు. ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు శాలువాతో సన్మానించి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లాకు టీజిఎల్‌ఐ కార్యాలయ ఏర్పాటుకు కృషి చేయాలని, సరిహద్దు ప్రాంత పాఠశాలలో పనిచేస్తున్న కర్ణాటక ఉపాధ్యాయులకు మెడికల్ రియంబర్స్‌మెంట్ కల్పించాలని, డీఈఓ, ఎమ్మార్సీ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచాలన్నారు. యాదగిరి జనార్దన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి