
సీడీపీఓలు, సూపర్‌వైజర్ల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష
నారాయణపేట: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రిస్కూల్స్‌గా మార్చుకోవాలని, చిన్నారులంతా తప్పనిసరిగా ప్రిస్కూల్‌కు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ టీచర్లకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రిస్కూల్ మేళతో విద్యార్థులకు చిన్నతనం నుంచే మానసిక, శారీరక అభివృద్ధి జరుగుతుందని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న మోడల్ ప్రి స్కూల్‌ను ఏప్రిల్ 6న ప్రారంభోత్సవం అయ్యేలా చూడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సమయానికి చేరేలా చూడాలన్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. లోప పోషణ పిల్లలను గుర్తించి అన్ని విధాలా పరిశీలిస్తూ.. ఉండాలన్నారు. గర్భిణిలు, బాలింతలు సెంటర్‌కు వచ్చేలా ప్రజాప్రతినిధుల సాయం తీసుకుని వారికి పోషక ఆహారాన్ని అందించాలన్నారు. గర్భిణి, బాలింతలకు హిమోగ్లోబిన్, ఎనిమియా, ఐరన్ తక్కువ ఉన్న వారిని గుర్తించి వారికి కావాల్సిన వైద్య సేవలు అందించేలా అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లకు సూచించాలన్నారు. బస్సు సౌకర్యం లేని అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలనకు ఇబ్బందులు కలిగితే సూపర్‌వైజర్ల తమ తరఫున ద్విచక్రవాహనానికి ఆర్థికసాయం చేస్తామని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతినెల ఓ అంగన్‌వాడీ కేంద్రానికి ప్రతిభ పురస్కారం అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని మోడల్ ప్రి స్కూల్‌ను పరిశీలించారు. సమావేశంలో డీబ్ల్యూఓ వేణుగోపాల్, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
సర్వే అర్జీలను వెంటనే పరిష్కరించాలి
మీసేవ ద్వారా సర్వే కోసం పెట్టుకున్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సర్వేయర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వేయర్ల సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా గుర్తించాలన్నారు. లేఅవుట్ల అప్రూవల్‌కు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. సర్వే చేసి చెక్ లిస్ట్‌లో నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరచలాన్నారు. సంగంబండ ఆర్‌ఆర్ సెంటర్‌కు సంబంధించిన భూ సర్వే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ల్యాండ్ అండ్ సర్వే రికార్డు అధికారి గిరిధర్, మూస, సర్వేయర్లు మల్లేశ్, క్రిష్ణ, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన ఫలితాలు సాధించాలి
ఎస్సీ వసతిగృహాల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లాలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల వసతిగృహాల్లో ఉండి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను దీవించి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కన్యాకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీ హర్ష