
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి
నారాయణపేట టౌన్: రాహుల్‌గాంధీని పార్లమెంట్‌లో అనర్హుడిగా చేస్తూ కుట్రపూరితంగా, నియంతలా వ్యహరిస్తున్న కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం నశించాలని డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీని ఎంపీగా అనర్హులుగా ప్రకటించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం నిజాలు మాట్లాడితే వేటు వేయడం ప్రధాని మోదీ నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు. దేశంలోని అన్నిపార్టీలు రాహుల్‌గాంధీకి మద్దతు తెలుపుతున్నా బీజేపీ ప్రభుత్వం మాత్రం చేసిన తప్పును సమర్థిఽంచుకోవడం సబబు కాదనిఅన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, మద్దూర్ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్, ఎండి గౌస్, సదాశివరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఎండి.సలీం, నాయకులు బోయ శరణప్ప, రమేష్, విఘ్నేశ్వర్, ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.