
నర్వ: మండల రైతుల ఇబ్బందులను తీర్చేందుకే వెయ్యి మెట్రిక్ టన్నుల గోదాంలు రెండు మంజూ రు చేసినట్లు డీసీసీబీ సీఈఓ లక్ష్మయ్య అన్నారు. సోమవారం నర్వ పీఏసీఎస్ చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాల రికవరీలో గతంలో చివరిస్థానంలో ఉండేది, నేడు పాలకవర్గం కృషితో జిల్లాలో మొదటి స్థానానికి చేరడం అభినందనీయమన్నారు. మొత్తం రూ.2.20కోట్లు దీర్ఘకాలి క రుణాలు, రూ.4కోట్ల రైతుల పంట రుణాలను రికవరీ చేయించామని చైర్మన్ లక్ష్మీకాంత్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సహకారంతో చేయించామన్నారు. ఈ సందర్భంగా రైతులు గతంలో పీఎసీఎస్‌లో జరిగిన అవకతవకలపై సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చైర్మన్ గతంలో పాలకవర్గం చైర్మన్ రామకృష్ణారెడ్డి, సీఈఓ కిషన్‌లపై కోర్టు ద్వారా ఆస్తుల అటాచ్‌మెంట్‌తో రూ.1.20 కోట్లు జప్తు చేయించేందుకు పోరాటం చేస్తున్నట్లు సభకు తెలిపారు. ఈ సభలోనే హౌసింగ్, విద్య, వ్యాపార రుణాలకు సంబందించి లబ్ధిదారులకు రుణఅనుమతి పత్రాలను అందించారు. రైతుల అభ్యర్థన మేరకు టార్పాలిన్‌లు అందిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ సురేఖ, జెట్పీటీసీ సభ్యురాలు గౌనిజ్యోతి, విండో వైస్ చైర్మన్ లక్ష్మన్న, రైతుసమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మండ్ల చిన్నయ్య జిల్లా డీసీసీబీ అధికారులు అశోక్‌కుమార్, ప్రశాంత్‌భూషన్‌రెడ్డి, మణికంఠ, గోపాల్, సీఈఓ ఉదయ్‌కుమార్, డైరెక్టర్‌లు శ్రీనివాస్‌రెడ్డి, పల్లె శేఖర్, రామేశ్వర్‌రెడ్డి, వివేకానందరెడ్డి, లింగన్న పాల్గొన్నారు.

రుణాల అనుమతి పత్రాలను అందిస్తున్నజిల్లా డీసీసీబీ, పాలకవర్గం