నారాయణపేట: నారాయణపేట మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం చైర్‌పర్సన్ మోసటి జ్యోతి, సభ్యులందరూ సోమవారం స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి మార్కెట్ చైర్‌పర్సన్, మార్కెట్ వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులుగా నియమించడంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్‌పర్సన్ జ్యోతి, మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీకాంత్, పాలకవర్గ సభ్యులు కాకర్ల నారాయణమ్మ, మధుసూదన్, మాణిక్యప్ప, కొండారెడ్డి, సురేందర్‌రెడ్డి, కుర్వ మల్లేశ్, ఊట్కూర్ సింగిల్‌విండో అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కన్నా జగదీశ్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు విజయ్‌సాగర్, సీనియర్ నాయకులు గందె చంద్రకాంత్, సుదర్శన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వేపూరి రాములు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు తాజుద్దీన్ పాల్గొన్నారు.