సెరికల్చర్‌కు ప్రత్యామ్నాయంగా ఎరికల్చర్
● ఆముదం ఆకులు తినే ఎరి పట్టుపురుగుల పెంపకంపై పట్టుపరిశ్రమ శాఖ దృష్టి ● తక్కువ పెట్టుబడితో అధిక నికరాదాయం ● 2026–27 నుంచి ఎరికల్చర్ సాగు.. వచ్చేనెలలో శిక్షణ కార్యక్రమాలు
కర్నూలు(అగ్రికల్చర్): మల్బరీ ద్వారా పట్టు సాగు పెంపకంపై రైతులు ఆసక్తి చూపకపోతుండటంతో పట్టుపరిశ్రమ శాఖ ప్రత్యామ్నాయం వైపు దృష్టి సా రించింది. మల్బరీ ద్వారా చేపడుతున్న పట్టు పురుగుల పెంపకం, పట్టు గూళ్ల ఉత్పత్తిని సెరికల్చర్‌గా వ్యవహరిస్తారు. ఇందులో పెట్టుబడి వ్యయం ఎక్కు వగా ఉండటం, పట్టుగూళ్ల ధరలు తక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల పట్టుసాగు రైతులకు కలసి రావడం లేదు. దీంతో జిల్లాలో సెరికల్చర్ గణనీయంగా తగ్గిపోవడంతో పట్టుపరిశ్రమ శాఖ దృష్టి ఎరికల్చర్‌పై పడింది. పట్టు పురుగుల్లో ఎరి రకం పురుగులు ఆముదం(క్యాస్టర్) ఆకులు తిని గూళ్లు కడుతాయి. దీనినే ఎరికల్చర్‌గా పేర్కొంటారు. ఎరికల్చర్ సాగు రాంచీలో విజయవంతంగా ఉంది. ఈ సాగులో పెట్టుబడి వ్యయం బాగా తక్కువ. వాతావరణ పరిస్థితులకు ఆనువుగా ఉంటుంది. ఆముదం ఆకులు తినే పట్టుపురుగులు అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటాయి. కాగా మల్బరీ ఆకులు తినడం ద్వా రా కట్టిన పట్టుగూళ్లలో నాణ్యత ఉంటుంది. ధర కిలోకు రూ.600 వరకు ఉంటుంది. ఎరికల్చర్‌లో ఉత్పత్తి అయిన పట్టుగూళ్ల నాణ్యత అంతగా ఉండ దు.ధర కూడా తక్కువే. అయితే, పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండటం, నికరాదాయం ఎక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం తదితర కారణాలతో ఎరికల్చర్ కలసి వస్తు ందనే అభిప్రాయం పట్టుపరిశ్రమ అధికారుల్లో ఉంది.
ఉమ్మడి జిల్లాలో 50 వేల హెక్టార్లలో ఆముదం సాగు
ఉమ్మడి జిల్లాలో ఆముదం సాగు దాదాపు 50 వేల హెక్టార్లలో ఉంది.సాగు ఎక్కువగా ఉండటం ద్వారా ఎరి పట్టుపురుగులతో పట్టుగూళ్ల ఉత్పత్తి సాధ్యమేనని అధికారులు పేర్కొంటున్నారు. ఎరి పట్టుపురుగులు ఆముదం ఆకునే తింటాయి. ఆకులను పురుగులకు ఆహారంగా ఉపయోగిస్తారు. ఆముదం కాయలను యథావిధిగా అమ్ముకోవచ్చు. ఇందువల్ల రైతులు కూడా ఎరికల్చర్‌పై ఆసక్తి చూపుతారనే అభిప్రాయం ఉంది. వచ్చే నెలలో ఎరి పట్టుపురుగుల పెంపకంపై రైతులకు పట్టుపరిశ్రమ శాఖ శిక్షణ కార్యక్రమాలు కూడ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లా పట్టుపరిశ్రమ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అముదం సాగును అధ్యాంయం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆముదం సాగు ఎన్ని ఎకరాల్లో ఉందనే దానిని సేకరించి పట్టు పరిశ్రమ శాఖకు నివేదించారు. 2026–27 నుంచి ఆముదం పంట ఆధారంగా ఎరి పట్టుపురుగుల పెంపకానికి శ్రీకారం చుట్టేందుకు ఆ శాఖ కసరత్తు చేస్తోంది.
సెరికల్చర్‌కు ప్రత్యామ్నాయంగా ఎరికల్చర్


