● దారులన్నీ ఇంతే
అధ్వానంగా రామాపురం,
లింగాపురం రోడ్డు
గతుకుల రోడ్డుపై భయంభయంగా ప్రయాణం
రోడ్లను అభివృద్ధి చేస్తామని, ఎక్కడా చిన్నపాటి గుంత లేకుండా చేస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ప్రగల్భాలు పలికారు. ఏడాదిన్నర గడిచినా అతీగతీ లేదు. దీంతో ఏ ఊరు రోడ్డు చూసినా కంకర తేలి, అడుగడుగునా మోకాళ్లలోతు గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఈ అధ్వాన దారులపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ మాత్రం ఆదమరిచినా గుంతల్లో పడిపోవాల్సిందే. బండిఆత్మకూరు మండలం రామాపురం, లింగాపురం గ్రామాలకు వెళ్లే దారులు మరీ దారుణంగా ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోంది.
– సాక్షి, ఫొటోగ్రాఫర్, కర్నూలు
● దారులన్నీ ఇంతే


