పోలీసు అమరవీరులకు నివాళి
నంద్యాల: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నంద్యాలలో జిల్లా ఎస్పీ సునిల్ షెరాన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ నుంచి గాంధీచౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది అక్టోబర్ 31వ తేదీన విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకునేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది విధి నిర్వహణలో 166 మంది పోలీసులు అమరులయ్యారన్నారు. దేశ రక్షణ, సమగ్రత కొరకు సువిశాల భారతదేశాన్ని ఏకతాటిపై నడిపిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్‌పటేల్ మనందరికీ స్ఫూర్తి దాయకమన్నారు. ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, ఏఎస్పీ జావళి, సీఐలు సుధాకర్‌రెడ్డి, కంబగిరిరాముడు, అస్రార్‌బాషా, మల్లికార్జునగుప్త, ఈశ్వరయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.


