నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం ఇవ్వాలి
పాణ్యం: మోంథా తుపాన్‌తో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. షరతులు విధించి పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే రైతులతో కలసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. పాణ్యం, తొగర్చేడు, మద్దూరు, అనుపూరు, కొత్తూరు గ్రామాల్లో దెబ్బతిన్న మిరప, మొక్కజొన్న, వరి, జొన్న, మిను ము, పొగాకు పంటలను శుక్రవారం కాటసాని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులకు ఈ–క్రాప్ బుకింగ్ చేయలేదన్నారు. కేవలం బ్యాంక్‌ల్లో రుణాలు తీసుకున్న వారికి, మరి కొందమంది రైతులకు మాత్రమే అధికారులు ఈ–క్రాప్ బుకింగ్ చేశారన్నారు. రైతులకు అన్యాయం చేసి తుపాన్‌తో పంట నష్టం జరిగితే ఈ–క్రాప్ నమోదు చేస్తేనే బీమా వర్తిసుందని చెప్పడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదానికి రైతులు బలికావాల్సి వస్తోందన్నా రు. నష్టపోయిన ప్రతి రైతుకూ నష్ట పరిహారం దక్కాల్సిందేనన్నారు. లేదంటే రైతులతో కలసి పోరాటం చేస్తామన్నారు.
నిలువునా మోసం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయ అధికారు లే పొలాల వద్దకు వెళ్లి ఈ–క్రాప్ బుకింగ్ చేసేవారని కాటసాని గుర్తు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అదే సీజన్లో పరిహారం అందించే వారన్నారు. అప్పట్లో ఈ–క్రాప్ బుకింగ్‌తో రైతుకు నాలుగు ప్రయో జనాలు కల్పించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత రైతులను మోసం చేసిందన్నారు. ఈ–క్రాప్ చేయకుండా నిలువునా ముంచిందన్నారు. రైతులపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
వీహెచ్‌ఏపై ఫిర్యాదుల వెల్లువ
కొత్తూరు వీహెచ్‌ఏగా విధులు నిర్వహిస్తున్న చెన్నయ్యపై కాటసానికి రైతులు ఫిర్యాదు చేశారు. పంట నమోదు చేయలేదని, ఈ–క్రాప్ బుకింగ్‌పై ఎవ్వరికీ చెప్పలేదన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ‘ఎవ్వరికై నా చెప్పుకోండి’ అని బెదిరించారన్నారు. తనకు కావాల్సిన వారికే ఈ–క్రాప్ చేశారన్నారు. ఈవిషయాన్ని ఏఓకు చెప్పగా ఎలాంటి స్పందన లేదన్నారు. సచివాలయంలో సగానికిపైగా ఈ–క్రాప్ చేయకుండా కాలయాపన చేసి మండిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్‌తో మాట్లాడతామని రైతులకు కాటసాని హామీ ఇచ్చారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బాబు, సుబ్బారెడ్డి, నాగేంద్ర, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు రామలక్ష్మ య్య, జాకీర్, సత్యాలు, రామచంద్రుడు, చంద్రశేఖర్‌రెడ్డి, సద్దల శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, నారాయణస్వామి, భాస్కర్‌రెడ్డి, శివ రామిరెడ్డి, వడ్డుగండ్ల రాములు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదేం అంచనా?
జిల్లాలో మోంథా తుపాన్ ధాటికి 36,948 హెక్టార్లలో నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా చెప్పడం దారుణంగా ఉందని కాటసాని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 2,21,376హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారన్నారు. తుపాన్ ప్రభావంతో లక్షకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఉద్యా వన పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు వాటిల్లిన నష్టంపై నివేదిక పంపాలన్నారు. గ్రామాంలో టీడీపీ నాయకులు ఎవరో చెప్పారని లెక్కలు రాసే ప్రయత్నం చేయరాదన్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.50వేలకు పైగా రైతులు పెట్టుబడి పెట్టారనే విషయాన్ని గ్రహించాలన్నారు.
పంట నష్టాన్ని తక్కువగా చేస్తే
చూస్తూ ఊరుకోం
రైతులతో కలసి పోరాటం చేస్తాం
ఈ–క్రాప్ చేయడంలో
రాష్ట్ర ప్రభుత్వం విఫలం
షరతులు లేకుండా పంట నష్టాన్ని
అంచనా వేయాలి
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి


