ప్రైవేట్ బస్సులు భద్రమేనా?
శ్రీశైలంటెంపుల్: ఇతర రాష్ట్రాల్లో బస్సులను రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏపీలో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్‌కు చెందిన స్లీపర్ బస్సులను రవాణాశాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఘాట్‌రోడ్లలో బెంగళూరు నుంచి శ్రీశైలానికి, హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ట్రావెల్ బస్సులు నడుపుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు చిన్నటేకూరు సమీపంలో ఆగ్నిప్రమాదానికి గురై 19 మంది మృతి చెందారు. అయితే వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఓ స్లీపర్ బస్సు బెంగళూరు నుంచి శ్రీశైలానికి ప్రతి రోజూ వస్తోంది. అలాగే భైరవ, ఎస్వీబీటీ, శ్రీతులసి, గుమ్మాల ఇలా పలు ట్రావెల్‌కు చెందిన స్లీపర్ బస్సులు వస్తున్నాయి. శ్రీశైలం నుంచి ఆత్మకూరు వరకు 115 కిలోమీటర్ల ఘాట్‌రోడ్‌లో ట్రావెల్ స్లీపర్ బస్సులు ప్రయాణిస్తుంటాయి. ఇప్పటికై నా రవాణశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.


