మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
శిరివెళ్ల: తుఫాన్‌తో కురిసిన వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతిందని, రైతులను ఆదుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు అన్నారు. శనివారం మహదేవపురం, గుండంపాడు గ్రామాలలో పర్యటించి తడిసిన మొక్క జొన్న గింజలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అతివృష్టి, అనావృష్టితో మొక్కజొన్న పూర్తిగా దెబ్బతిందన్నారు. ఆరబోసుకున్న గింజలు తడిసి రంగు మారాయన్నాయన్నారు. ఎకరాకు రూ. 30 వేలు పెట్టి సాగు చేస్తే 15 కింటాళ్లు కూడా రాలేదన్నారు. వచ్చిన దిగుబడులను ఆరబోసుకుంటే వర్షాలకు తడిసి పోయాయన్నారు. ప్రభుత్వం స్పందించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.


