
పనిచేయని సెల్‌ఫోన్లు మాకొద్దు
ఆళ్లగడ్డ: సెల్‌ఫోన్ పనిచేయదు.. సెల్‌ఫోన్ పనిచేస్తే సిమ్ పనిచేయదు.. ఇలాంటివి మాకెందుకు అని ప్రభుత్వం సరఫరా చేసిన సెల్‌ఫోన్లను అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం ఐసీడీఎస్ కార్యాలయంలో వెనక్చిచ్చి నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు అందరూ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం చేరుకుని మూకుమ్మడిగా తమ సెల్‌ఫోన్లను వెనక్కిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏమాత్రం పనిచేయని సెల్‌ఫోన్లు సరఫరా చేసి ఇవి పాడైతే మీరే బాధ్యులవుతారని పూచీకత్తు కూడా రాయించుకోవడం దారుణమన్నారు. సెల్‌ఫోన్లకు ఇచ్చినా నెట్ కూడా సరిగా పనిచేయడంతో అర్ధరాత్రి సమయంలో మేల్కొని సమాచారాన్ని పంపించాల్సి వస్తోందని వాపోయారు. రాజకీయ వేధింపులు ఆపాలని, కనీస వేతనం రూ.26వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సరఫరా చేసిన సెల్‌ఫోన్లు, సిమ్‌లు వెనక్కిచ్చి అంగన్‌వాడీల నిరసన