
నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల
● రూ.5.40 కోట్లతో నిర్మించిన రెండు నెలలకే ఛిద్రం
పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రోడ్డు మున్నాళ్ల ముచ్చటగా మారింది. ఊరికి కొత్త రోడ్డు వేశారనే ప్రజల సంతోషం రెండు నెలలకే మాయమైంది. కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డులో నాణ్యత డొల్ల కావడంతో రోడ్డంతా గుల్లగా మారుతోంది. పాణ్యం – దుర్వేశి మెట్ట వరకు దాదాపుగా 13 కిలో మీటర్ల డీఎంఎఫ్ కింద రూ. 5.40 కోట్లతో బీటీ రోడ్డు వేశారు. మే నెలలో వేసిన ఈ బీటీ రోడ్డు పట్టుమని రెండు నెలల పూర్తి కాకముందే నాణ్యత బట్టబయలైంది. గోరుకల్లు – పాణ్యం వరకు గుంతలు పడడంతో అధికారులు ప్యాచ్‌లు వేసి అక్రమాలను కప్పేశారు. మరో చోటా రోడ్డు సైడ్ దెబ్బతిని వాహనాలు అదుపు తప్పేలా మారింది. రోడ్డు సైడ్‌కు గ్రావెల్ వేయాల్సి ఉండగా గోరుకల్లు వద్ద లభించే సుద్దను తెచ్చి వేయడంతో ప్రజలు అడ్డుకున్నారు. ఆ తర్వాత గ్రావెల్ వేసి రోలర్‌తో తొక్కించారు. ఇప్పటికీ పాణ్యం సమీపంలో సైడ్‌కు సుద్ద ఉంది. రోడ్డు నాణ్యత పరిక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు పట్టించుకోకపోవడంతో రహదారి ఛిద్రమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు.
– పాణ్యం

నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల

నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల

నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల