
తూతూ మంత్రంగా..
కొత్తపల్లి: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ 2.0 తూతూ మంత్రంగా సాగింది. కొన్ని పాఠశాలలో తల్లిదండ్రులు రాగా, మరికొన్ని పాఠశాలలో అరకొర మందితోనే సమావేశాలు నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో సెమియానాలు, రంగుల జెండాలు కట్టి ప్రజాథనం వృథా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. కార్యక్రమం మధ్యలోనే కొంతమంది తల్లిదండ్రులు ఇళ్లకు వెళ్లిపోయారు. తల్లికి వందనం పథకాన్ని ప్రజల్లోకి తీసుకు పోయేందుకే ఈ కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు. గువ్వలకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జీవనోపాధి కోసం వలస వెళ్లారని, సీజనల్ హాస్టల్ వసతి కల్పించాలని ఉపాధ్యాయులు కోరారు.
కార్యక్రమం మధ్యలోనే ఇంటికి వెళ్తున్న విద్యార్థుల తల్లులు