
ఏపీ ఈఏపీ సెట్‌కు 94.04 శాతం హాజరు
కర్నూలు సిటీ: ఏపీ ఈఏపీ సెట్ సోమవారం ప్రారంభం కాగా 94.04 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కర్నూలు జిల్లాలో 9, నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 3,190 మందికిగాను 3,000 మంది (94.04 శాతం) హాజరయ్యారు. కర్నూలు నగరంలో 7 కేంద్రాలు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో ఉదయం సెషన్ పరీక్షకు 1,597 మందికిగాను 1,492 మంది, మధ్యాహ్నం సెషన్‌లో జరిగిన పరీక్షకు 1,593 మందికిగాను 1,508 మంది హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో 3 కేంద్రాలలో ఉదయం సెషన్‌లో 713 మందికి 659 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 711 మందికిగాను 659 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కర్నూలు నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు.
సమయానికి చేరుకోలేక వెనుదిరిగిన ఇద్దరు విద్యార్థులు