
పాండురంగడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యుల ఆధ్వర్యంలో స్వామికి ప్రాత:కాల పూజ, పంచామృతాభిషేకం, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, విష్ణు అష్టోత్తర శతనామావళి, మంత్రపుష్పం, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం, తదితర కార్యక్రమాలు నిర్వహిచారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి కోట తిరుణాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ద్వాదశ కుంభహారతి, పేట, కోనేటి తిరుణాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు.