
ఒకే రోజు గుడి నిర్మాణం
బేతంచెర్ల: సాధారణంగా ఒకే రోజు ఆలయ నిర్మాణం పూర్తికాదు. అయితే, మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో ఓ భక్తుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించారు. బుధవారం స్వామి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి సాయంత్రం నాలుగు గంటల్లోగా పూర్తి చేశారు. సుమారు 30 మంది కూలీలతో ఈ పనులు చేపట్టారు. నెలరోజుల తర్వాత స్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవం ఉంటుందని ఆలయ నిర్మాణ దాత బ్రహ్మయ్య తెలిపారు. 13 ఏళ్ల క్రితం ఇదే మాదిరిగా బేతంచెర్ల పట్టణంలో స్వామి మందిరం నిర్మించినట్లు వెల్లడించారు.

ఒకే రోజు గుడి నిర్మాణం