టీడీపీ కార్యకర్తలకే డ్రోన్‌లు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తలకే డ్రోన్‌లు

Apr 29 2025 9:36 AM | Updated on Apr 30 2025 1:46 AM

టీడీపీ కార్యకర్తలకే డ్రోన్‌లు

టీడీపీ కార్యకర్తలకే డ్రోన్‌లు

ఉమ్మడి జిల్లాకు 80 మంజూరు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే

అందుబాటులోకి సేవలు

అప్పట్లో మహిళా సంఘాలకు

ఉచితంగా 8 సరఫరా

శిక్షణ ధ్రువపత్రాలు ఇచ్చిన ఆచార్య

ఎన్‌జీ రంగా వ్యవసాయ

విశ్వవిద్యాలయం

కూటమి ప్రభుత్వం అప్పటి గ్రూపులను

పక్కన పెట్టిన వైనం

టీడీపీ కార్యకర్తలతో ఎఫ్‌ఎంబీ కిసాన్‌

డ్రోన్‌ గ్రూపుల ఏర్పాటు

కర్నూలు(అగ్రికల్చర్‌): వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకునేందుకు సాంకేతికత దోహద పడుతోంది. ఇందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల వారీగా(ఆర్‌ఎస్‌కేలు) వైఎస్సార్‌ యంత్రసేవ పథకం కింద కస్టమ్‌ హయరింగ్‌ సెంటర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లు అందుబాటులోకి తెచ్చింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సులభంగా, వేగంగా పురుగు మందుల పిచికారీ కోసం డ్రోన్‌లను కూడా వినియోగంలోకి తీసుకొచ్చింది. నాటి ప్రభుత్వ చొరవతో వివిధ ఎరువుల కంపెనీలు 8 డ్రోన్‌లు మహిళా గ్రూపులకు సరఫరా చేశా యి. ఐదు కోరమాండల్‌ కంపెనీ, ఇప్కో, ీపీపీఎల్‌, ఆర్‌సీఎఫ్‌ కంపెనీలు ఒక్కొక్కటి చొప్పున అందించాయి. డ్రోన్‌ల వినియోగానికి ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి పైలెట్‌ శిక్షణ కూడా ఇప్పించారు. 2023–24లోనే ఈ గ్రూపులకు సబ్సిడీపై డ్రోన్‌లు ఇవ్వాలని తలపెట్టినప్పటికీ ఎన్నికల కోడ్‌ రావడం వల్ల సాధ్యం కాలేదు. కూటమి ప్రభుత్వం కూడా డ్రోన్‌ సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. అయితే టీడీపీ కార్యకర్తలకే డ్రోన్‌లను మంజూరు చేస్తుండటం గమనార్హం. 2023–24లో రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారితో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి ఇవ్వాలని తలపెట్టింది. కూటమి ప్రభుత్వం కూడా మొదట్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పైలెట్‌ శిక్షణ పొందిన వారిలో ఆసక్తి ఉన్న గ్రూపులకు డ్రోన్‌లు ఇవ్వాలని తలపెట్టింది. అయితే ఆ ప్రభుత్వంలో ఎంపిక చేసిన వారికి ఇవ్వడం తగదని కూటమి పార్టీల నేతలు ఒత్తిడి తెచ్చి టీడీపీ కార్యకర్తలకే మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీ లు రెకమెండ్‌ చేసిన కార్యకర్తలకే డ్రోన్‌లు అంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది.

నాడు శిక్షణ సర్టిఫికెట్లు పొందినా..

గత ౖవైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కర్నూలు జిల్లాలో 36 మంది, నంద్యాల జిల్లాలో 35 మంది రిమోట్‌ పైలెట్‌ శిక్షణ పొందారు. వీరిలో అగ్రికల్చర్‌ బీఎస్సీ, అగ్రికల్చర్‌ డిప్లొమో చేసిన వారు కూడా ఉన్నారు. గుంటూ రులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వీరు 12 రోజుల శిక్షణ తీసుకుని సర్టిఫికెట్‌లు అందుకున్నారు. 2024 జూన్‌ నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో డ్రోన్‌ అందుబాటులోకి రావడం ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా ఏడాది జాప్యం చేశారు. ఎట్టకేలకు 2025–26లో డ్రోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే వైఎస్సార్‌ సీపీ పాలనలో ఎంపిక చేసిన గ్రూపులను, రిమోట్‌ పైలెట్‌లను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. కొందరు వ్యవసాయ అధికారులే సంబంధిత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో మాట్లాడు కోవాలని సూచిస్తుండటం గమనార్హం. టీడీపీ మద్దతుదారులు, సానుభూతి పరులనే ఎంపిక చేస్తుండటంతో తమ పరిస్థితి ఏమిటని శిక్షణ పొందిన వారు ప్రశ్నిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ హయాంలో రిమోట్‌ పైలెట్‌గా శిక్షణ పొందిన వారిలో కూటమి ప్రభుత్వంలో కూడా కొందరికి అవకాశం ఇచ్చారు. శిక్షణ పొందిన వారు సంబంధిత ఎమ్మెల్యేలను కలువడంతో ఇది సాధ్యమైంది. జిల్లాలో 36 మంది పైలెట్‌ శిక్షణ పొందితే 10 మందికి పైగా అవకాశం దక్కించుకున్నారు. నంద్యాల జిల్లాలో మాత్రం గత ప్రభుత్వంలో శిక్షణ పొందిన వారందరినీ ౖవైఎస్సార్‌సీపీ ముద్ర వేసి పక్కన పెట్టడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అర్హతలను పక్కన పెట్టి కార్యకర్తలకే పెద్దపీట వేసింది. అర్హతలను పట్టించుకోకుండా పైలెట్‌ శిక్షణకు పంపుతుండటం మితిమీరిన రాజకీయానికి నిదర్శనం.

ఉమ్మడి జిల్లాకు 80 డ్రోన్‌లు మంజూరు

కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు

జిల్లాకు 80 డ్రోన్‌లను మంజూరు చేసింది.

కర్నూలు జిల్లాకు 40, నంద్యాల

జిల్లాకు 40 ప్రకారం కేటాయించారు.

టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటైన

ఎఫ్‌ఎంబీ కిసాన్‌ డ్రోన్‌ గ్రూపులకు

మంజూరు చేస్తోంది.

వీటి సరఫరాకు డ్రోగో, విహంగ

కంపెనీలను ఎంపిక చేసింది.

డ్రోగో కంపెనీ డ్రోన్‌ పూర్తి ధర రూ.9.80

లక్షలు, విహంగ కంపెనీ డ్రోన్‌ ధర

రూ.9.81 లక్షలు.

ఇందులో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తుంది.

అయితే 50 శాతం మొత్తానికి బ్యాంకులు

రుణాలు ఇస్తాయి. మిగిలిన 50 శాతం కిసాన్‌

డ్రోన్‌ గ్రూపులు భరిస్తాయి.

ఎఫ్‌ఎంబీ కిసాన్‌ డ్రోన్‌ గ్రూపులో ఐదుగురు

సభ్యులు ఉంటారు.

గ్రూపు సభ్యులు పైలెట్‌గా ఎంపిక చేసుకున్న

వారికి ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది.

ఈ పైలెట్‌ కనీసం మూడేళ్లు పనిచేయాల్సి

ఉంది.

మధ్యలో మానుకోవాలనుకుంటే రూ.70 వేలు

చెల్లించాలనే నిబంధన పెట్టారు.

డ్రోన్‌ల సామర్థ్యం 25 లీటర్లు.

నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement