మహానంది: మహానంది క్షేత్రంలో ఆరు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ. 58,36,566 ఆదాయం లభించినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాల ద్వారా రూ. 56,80,726 ఆదాయం లభించిందని, ఈ ఏడాది అదనంగా రూ. 1,55,750 వచ్చిందన్నారు. ప్రధాన విభాగాల ద్వారా పరిశీలిస్తే ప్రత్యేక దర్శనాల ద్వారా రూ. 21.30 లక్షలు, తాత్కాలిక దుకాణాల ద్వారా రూ. 13.25 లక్షలు, లడ్డూ ప్రసాదాల ద్వారా రూ. 14.03 లక్షలు, పులిహోర రూ. 5.45 లక్షలు, ఇతర విభాగాల ద్వారా మరికొంత ఆ దాయం వచ్చిందన్నారు. దేవస్థానానికి ఆదాయం కంటే భక్తుల సౌకర్యాలే ప్రాధాన్యతగా పని చేశామన్నా రు. సమావేశంలో సహాయ కార్యనిర్వహణాధికారి ఎరమల మధు, ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఉప ప్రధాన అర్చకులు వనిపెంట జనార్ధనశర్మ, ముఖ్య అర్చకులు రాఘవశర్మ, వేదపండితులు నాగేశ్వరశర్మ, శాంతారాంభట్ పాల్గొన్నారు.