‘మహా’నందమాయె! | - | Sakshi
Sakshi News home page

‘మహా’నందమాయె!

Mar 1 2025 8:03 AM | Updated on Mar 1 2025 7:59 AM

మహానంది: హర హర మహాదేవ... శంభో శంకరా...శ్రీ మహానందీశ్వరస్వామికీ జై... శ్రీ కామేశ్వరీదేవి మాతాకీ జై.... అంటూ శివనామస్మరణ మిన్నంటగా మహానందీశ్వరుడి రథోత్సవం శుక్రవారం మహానందంగా సాగింది. ముందుగా రథం వద్ద వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, పండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో రథాంగ పూజ, కూష్మాండబలి, బ్రహ్మ, ఇతర దేవతల ఆవహానాది పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. సంప్రదాయంలో భాగంగా తిమ్మాపురం గ్రామానికి చెందిన వీరయ్య ఆచారి, కుటుంబ సభ్యులు కుంభాహుతిని (నైవేద్యం) సంప్రదాయంగా తీసుకొచ్చి రథానికి సమర్పి ంచారు. అనంతరం నంద్యాల ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివి ల్‌ జడ్జి బి.రాధారాణి, న్యాయమూర్తి వాసు, ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ రామాంజనేయులు తదితరులు రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవంలో నంద్యాల ఏఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్‌, ఏఈఓ మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, దేవిక, సీఐ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement